అక్టోబర్ 29 ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | Today a birthday celebration on October 29 Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 29 ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 28 2015 11:50 PM | Updated on Sep 3 2017 11:38 AM

అక్టోబర్ 29 ఈరోజు  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 29 ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
నాగేంద్రబాబు (నటుడు), వరుణ్ ఆరోన్ (క్రికెటర్)

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. వీరి పుట్టిన  తేదీ 29. ఇది చంద్ర కుజుల కలయిక వల్ల ఏర్పడిన సంఖ్య. ఈ తేదీలో పుట్టిన వారికి 29 సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో వృద్ధి, విదేశీ యానం ఉంటుంది. రాజకీయాలలో ఉన్న వారికి తగిన పదవి, గుర్తింపు లభిస్తాయి. అయితే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు ఆ ప్రతిపాదనలు విరమించుకోవడం మంచిది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. వ్యతిరేకులు సైతం మీ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు.

పూర్వికుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ లేక గందరగోళం నెలకొంటుంది. భర్త ఆస్తిలో వాటా లేదా మనోవర్తి కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ ఏడాది తప్పక లాభిస్తుంది. పాజిటివ్ ఆలోచనలు చేయడం వల్ల విజయం సాధించగలుగుతారు. లక్కీ నంబర్స్: 1,2,4,6,8; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, బ్లూ, ఎల్లో, పర్పుల్, గోల్డెన్; లక్కీ డేస్: సోమ, బుధ, శుక్రవారాలు; సూచనలు: రోజూ కాసేపు వెన్నెలలో విహరించడం, చంద్రకాంతమణిని లేదా ముత్యాన్ని ధరించడం, శివుడికి అభిషేకం చేయడం, వికలాంగులకు, వృద్ధులకు సాయం చేయటం, ఆల యాలు, దర్గాలు, చర్చిలలో పాయసం లేదా ఇతర తీపి పదార్థాలు పంచిపెట్టడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement