ఎంత తిన్నావన్నది కాదన్నయ్యా...ఎంత సేపు కూర్చున్నావన్నదే..! | People & Co., a restaurant in Gurgaon | Sakshi
Sakshi News home page

ఎంత తిన్నావన్నది కాదన్నయ్యా...ఎంత సేపు కూర్చున్నావన్నదే..!

Jan 2 2017 11:33 PM | Updated on Sep 27 2018 2:31 PM

ఎంత తిన్నావన్నది కాదన్నయ్యా...ఎంత సేపు కూర్చున్నావన్నదే..! - Sakshi

ఎంత తిన్నావన్నది కాదన్నయ్యా...ఎంత సేపు కూర్చున్నావన్నదే..!

ఇక్కడ పిజ్జా ఉంది. పాస్తా ఉంది. రిసాటో ఉంది. ఢిల్లీ సమీపంలోని గుర్‌గావ్‌లో పీపుల్స్‌ అండ్‌ కో అనే ఒక రెస్టారెంట్‌కి వెళితే ఈ మూడు


ఉచితం
ఇక్కడ పిజ్జా ఉంది. పాస్తా ఉంది. రిసాటో ఉంది. ఢిల్లీ సమీపంలోని గుర్‌గావ్‌లో పీపుల్స్‌ అండ్‌ కో అనే ఒక రెస్టారెంట్‌కి వెళితే ఈ మూడు ఐటమ్స్‌లో మనకు ఇష్టమైన దాన్ని తినొచ్చు. ఇష్టమైతే మూడూ తినొచ్చు! ఇందులో విషయం ఏముందీ?! ఉంది. ఇవి మూడూ అక్కడ ఫ్రీ! ఉచితం!! అయితే చిన్న కండిషన్‌. సోమ, మంగళ వారాల్లో మాత్రమే ఉచితం.

అయితే ఏంటి? కుమ్మేయడానికి ఆ రెండు రోజులు చాలవా? చాల్తాయి. కానీ ఇంకో కండిషన్‌ కూడా ఉంది. ఫుడ్డుకి బిల్లు కట్టేక్కర్లేదు కానీ, రెస్టారెంట్‌లో కూర్చున్న టైమ్‌కి బిల్లు కట్టాలి! ఎంతంటే.. నిమిషానికి 15 రూపాయలు. ఆఫర్‌ బాగుందా? టైమ్‌ లెక్కేసుకుని తింటే బాగానే ఉంటుంది.


 

Advertisement
 
Advertisement
Advertisement