చక్కెర గుళికలు నొప్పిని తగ్గిస్తాయా?

Can sugar cartridges reduce pain? - Sakshi

పిల్లలు అనుకోకుండా కిందపడ్డారనుకోండి.. నొప్పి ఏమార్చేందుకు బెల్లం ముక్క నోట్లో పెట్టడం మనం చూసే ఉంటాం. గాయం తాలూకూ నొప్పి నుంచి వారి దృష్టి మళ్లించేందుకు ఇది పనికొస్తుందని మనం ఇప్పటివరకూ అనుకుంటూ ఉన్నాం. అయితే తగిన మెదడు నిర్మాణం, మానసిక స్థితి ఉన్న వారికి ఈ తీపి కాస్తా శక్తిమంతమైన మందుగానూ పనిచేస్తుందని అంటున్నారు నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఈ పరిశోధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంచనా.

అనేక దుష్ప్రభావాలను చూపించే రసాయనిక మందుల స్థానంలో ఒట్టి చక్కెర గుళికలు ఇవ్వవచ్చునని, ఫార్మా కంపెనీలు మందుల ప్రభావశీలతను పరీక్షించేందుకు కొంతమందికి ఇచ్చే ఉత్తుత్తి మాత్రలను లేకుండా చేయవచ్చునని, ఆసుపత్రి ఖర్చులూ తగ్గుతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వానియా అప్‌కారియన్‌ వివరించారు. నేచర్‌ కమ్యూనికేషన్స్‌ తాజా సంచికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం నొప్పితో బాధపడుతున్న వారికి ఏవో మందులిస్తున్నామని కాకుండా.. చక్కెర గుళికలే ఇస్తున్నాంగానీ.. అది నొప్పి తగ్గిస్తుందని నమ్మబలికితే చాలని వివరించారు. నడుం నొప్పితో బాధపడుతున్న కొందరిపై తాము ప్రయోగాలు నిర్వహించి మరీ ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top