సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు! | Seemandhra Congress list almost ready | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు!

Apr 11 2014 10:59 AM | Updated on Aug 18 2018 9:13 PM

సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు! - Sakshi

సీమాంధ్ర కాంగ్రెస్ తొలి జాబితా ఖరారు!

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం శుక్రవారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్తో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రులు చిరంజీవి, జేడీ శీలం శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీమాంధ్ర అభ్యర్థుల ఖరారుపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీమాంధ్రలో 150 స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అయితే ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర కమిటీ సమావేశం తర్వాత సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.  ఈరోజు సాయంత్రం లేదా శనివారం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement