రౌడీషీటర్‌తో రాహుల్ | rahul gandhi meet with rowdy sheeter | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌తో రాహుల్

Apr 30 2014 2:31 AM | Updated on Mar 29 2019 9:24 PM

రౌడీషీటర్‌తో రాహుల్ - Sakshi

రౌడీషీటర్‌తో రాహుల్

కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫొటోల యుద్ధం ముదురుతోంది. రాజస్థాన్ రౌడీషీటర్ ఆసిఫ్ బిల్లా నడుపుతున్న మోటార్ సైకిల్ వెనుక సీట్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూర్చున్నట్లున్న ఫొటోను బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి మంగళవారమిక్కడ మీడియాకు చూపారు.

ఫొటోను బయటపెట్టిన బీజేపీ

 న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫొటోల యుద్ధం ముదురుతోంది. రాజస్థాన్ రౌడీషీటర్ ఆసిఫ్ బిల్లా నడుపుతున్న మోటార్ సైకిల్ వెనుక సీట్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూర్చున్నట్లున్న ఫొటోను బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి మంగళవారమిక్కడ మీడియాకు చూపారు. నరేంద్ర మోడీ, హవాలా రాకెట్ కేసులో అరెస్టయిన అఫ్రోజ్ ఫత్తా అనే నిందితుడితో కలసి తీయించుకున్నట్లున్న ఫొటోను కాంగ్రెస్ సోమవారం బయటపెట్టడంతో లేఖి దీన్ని బయటకు తీశారు.

‘రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉంటారు కనుక వ్యక్తులతో ఫోటోలు దిగకుండా తప్పించుకోలేరు. అయితే దీనికి ఏం సమాధానమిస్తారు?’ అని ఆమె ఫొటో చూపుతూ అన్నారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారంటూ బీజేపీ వాటిపై  సీడీని విడుదల చేయడంతో కాంగ్రెస్ మోడీ-ఫత్తా ఫొటోలను బయటపెట్టడం, దీనికి ప్రతిగా కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్, ఫత్తా కలిసి దిగిన్నట్లున్న ఫొటోను బీజేపీ విడుదల చేయడం తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement