కేసీఆర్‌పై ఓయూ విద్యార్థుల ఆగ్రహం | ou student Wrath on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ఓయూ విద్యార్థుల ఆగ్రహం

Apr 28 2014 2:06 AM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్‌పై ఓయూ విద్యార్థుల ఆగ్రహం - Sakshi

కేసీఆర్‌పై ఓయూ విద్యార్థుల ఆగ్రహం

కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు షాక్ ఇచ్చారు.

కేసీఆర్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు షాక్ ఇచ్చారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడలో జరిగే బహిరంగసభకు హాజరయ్యేందుకు ఓయూ క్యాంపస్‌లోని క్రీడా మైదానంలో కేసీఆర్ హెలికాప్టర్ దిగారు. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న కొందరు విద్యార్థులు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయవద్దని నినాదాలు చేస్తూ.. కేసీఆర్ వైపు దూసుకువచ్చారు.

 

దీంతో కేసీఆర్ కొందరు విద్యార్థులతో ఐదు నిమిషాలు మాట్లాడి.. సభకు వెళ్లకుండా తిరిగి హెలికాప్టర్‌లో బేగంపేటకు వెళ్లిపోయారు. విద్యార్థులతో మాట్లాడిన విషయాలను తర్వాత మీడియాకు వెల్లడిస్తామన్నారు. కాగా, కేసీఆర్ హెలికాప్టర్ గాలిలోకి ఎగరగానే కొందరు విద్యార్థులు ఆ వైపు చెప్పులు చూపిస్తూ, నినాదాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement