
ఆనంద్ శర్మ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అబద్దాలకోరని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు.
బెంగళూరు: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అబద్దాలకోరని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. ఈరోజు ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గుజరాత్ మాదిరి రాష్ట్రమంటూ మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
నరేంద్ర మోడీ గర్విష్టి అని, అతనికి జాతీయ దృష్టిలేదని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి యుపిఏ వస్తుందన్న ధీమాను ఆయన వ్వక్తం చేశారు.