టీడీపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది | in violation of tdp Alliance | Sakshi
Sakshi News home page

టీడీపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది

Apr 25 2014 2:57 AM | Updated on Mar 29 2019 9:24 PM

టీడీపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది - Sakshi

టీడీపీ పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించింది

సంతనూతలపాడులో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని తానేనని దారా సాంబయ్య ప్రకటించుకున్నారు.

  ఎస్‌ఎన్‌పాడులో టీడీపీ, బీజేపీ
 ఉమ్మడి అభ్యర్థి తానేనన్న సాంబయ్య

 
 చీమకుర్తి, న్యూస్‌లైన్ : సంతనూతలపాడులో టీడీపీ, బీజేపీ ఉమ్మడి  అభ్యర్థిని తానేనని దారా సాంబయ్య ప్రకటించుకున్నారు. చీమకుర్తిలోని ఎన్‌ఎస్పీ కాలనీలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సాంబయ్య.. ప్రచార రథానికి ఒక వైపు బీజేపీ జెండాలు, మరో వైపు టీడీపీ జెండాలు ఏర్పాటు చేశారు.

వాహనం బంపర్‌పై మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు ఫొటోలు ఉంచి ఎన్నికల ప్రచారం సాగించడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. పొత్తులో భాగంగా టీడీపీ వారు సంతనూతలపాడును బీజేపీకి కేటాయించారు, అయితే టీడీపీ నేతలు పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి విజయ్‌కుమార్‌కు అడ్డదారిలో బీ ఫారం ఇచ్చారని సాంబయ్య మండిపడ్డారు. టీడీపీ నేతలు, విజయ్‌కుమార్ రాజకీయాలను వ్యాపారంగా మార్చారన్నారు. ప్రచారంలో బీజేపీ నాయకులు బత్తిని నరసింహారావు, ఎంవీ రమణారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement