సుపరిపాలనే ప్రధాన ఎజెండా: రాజ్నాథ్ | Good Governance BJP Top Priority, says Rajnath Singh | Sakshi
Sakshi News home page

సుపరిపాలనే ప్రధాన ఎజెండా: రాజ్నాథ్

May 20 2014 1:06 PM | Updated on Mar 29 2019 9:00 PM

సుపరిపాలనే తమ ప్రధాన ఎజెండా అని, ఈ నినాదంతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు.

న్యూఢిల్లీ: సుపరిపాలనే తమ ప్రధాన ఎజెండా అని, ఈ నినాదంతోనే ముందుకెళతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. స్వావలంబన, ఆర్థిక స్థిరత్వమున్న దేశాభివృద్ధే తమ లక్ష్యమన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ రోజు చరిత్రాత్మకమైందని వ్యాఖ్యానించారు.

ఈ ఎన్నికల్లో ఓటరు చైతన్యం వెల్లవిరిసిందన్నారు. దేశ చరిత్రలో అత్యధిక ఓట్లు నమోదు కావడం ఇదే ప్రథమం అన్నారు. పది రాష్ట్రాల్లో బీజేపీ సంపూర్ణ విజయం సాధించిందని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఎక్కువ స్థానాలు సాధించామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement