కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి | development on the state in congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి

Mar 30 2014 11:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి - Sakshi

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మరింత అభివృద్ధి

త్వరలో జరుగనున్న ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి పేర్కొన్నారు.

చేవెళ్ల, న్యూస్‌లైన్ :  త్వరలో జరుగనున్న ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ పి.వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
 
చేవెళ్లలోని రెండు ఎంపీటీసీ స్థానాలలో కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్న కె.పోచమ్మ, టేకులపల్లి శివరంజనిశ్రీను, జెడ్పీటీసీ అభ్యర్థి సుచితలను గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ దేశం సుస్థిరంగా ఉండాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని కోరారు.
 
డీసీసీబీ వైస్ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, వైస్ చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.బాల్‌రాజ్, మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్థానిక సంస్థలు బలోపేతమయ్యాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు జి.రవికాంత్‌రెడ్డి, ఎం.యాదగిరి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, శివానందం, డి.శ్రీధర్‌రెడ్డి, జి.సత్తిరెడ్డి, ఎం.వెంకటేశ్, టేకులపల్లి శ్రీను, కొజ్జెంకి శ్రీను, కె.బుచ్చిరెడ్డి, మాధవరెడ్డి, బి.విఠలయ్య తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement