చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్ | Chandrababu Naidu behaviour ashmed, says V. Hanumantha Rao | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్

Apr 30 2014 8:27 PM | Updated on Aug 14 2018 4:24 PM

చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్ - Sakshi

చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోంది: వీహెచ్

బీజేపీకీ రెండు ఓట్లు వేశానని బహిరంగంగా వెల్లడించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు విమర్శనాస్త్రాలు సంధించారు.

హైదరాబాద్: బీజేపీకీ రెండు ఓట్లు వేశానని బహిరంగంగా వెల్లడించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబుపై ఉన్న కాస్త గౌరవం పోయిందన్నారు. 9 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి
బీజేపీకి రెండు ఓట్లు వేశానని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు.

ఓటు ఎవరికి వేశావని తన తల్లిని అడిగినా చెప్పదన్నారు. చంద్రబాబు తీరు చూస్తే సిగ్గేస్తోందన్నారు. బీజేపీకి ఓటు వేశానని బహిరంగంగా చెప్పడమే కాక ఎన్నికల సంఘం కార్యాలయానికి మనషుల్ని పంపిస్తారా అంటూ వీహెచ్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement