'ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది' | ysrcp strong in prakasam district | Sakshi
Sakshi News home page

'ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది'

Jun 4 2016 1:15 PM | Updated on May 28 2018 1:52 PM

ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బలంగానే ఉన్నామని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

ఒంగోలు : ప్రకాశం జిల్లాలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బలంగానే ఉన్నామని ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సదరు నియోజకవర్గాలు ప్రజల అండతో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. శనివారం ఒంగోలులో వైవీ సుబ్బారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ మారిన నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఉత్తరాఖండ్ తరహాలో ఫిరాయింపుదారులపై వేటు తప్పదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement