'దమ్ముంటే పులివెందులలో చర్చకు సిద్ధమా?' | ysrcp MP ys avinash reddy dares tdp leader satish reddy | Sakshi
Sakshi News home page

'దమ్ముంటే పులివెందులలో చర్చకు సిద్ధమా?'

Jun 8 2016 1:24 PM | Updated on May 29 2018 4:26 PM

'దమ్ముంటే పులివెందులలో చర్చకు సిద్ధమా?' - Sakshi

'దమ్ముంటే పులివెందులలో చర్చకు సిద్ధమా?'

ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు.

కడప: వైఎస్ఆర్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు హామీలపై వైఎస్ జగన్తో చర్చించే స్థాయి సతీష్ రెడ్డికి లేదని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. దమ్ముంటే తనతో పులివెందులలో చర్చకు సిద్ధమా అని అవినాష్ రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు...రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యారని ఆయన అన్నారు.

అంతకు ముందు  చంద్రబాబు నాయుడు మోసాలపై  పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ చేస్తున్నారు. అనంతరం పులివెందుల పీఎస్ లో చంద్రబాబు మోసాలపై ఫిర్యాదు చేశారు. ఈ ర్యాలీలో వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నేతలు  పాల్గొన్నారు. నేడు చంద్రబాబు మోసాలపై ఏపీలోని అన్ని జిల్లాల్లో ఆయనపై కేసులు నమోదు చేసేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పులివెందులలో ఆ పార్టీ కీలక నేతలు భారీ ర్యాలీ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement