'చంద్రబాబు పర్యటనపై గోప్యత ఎందుకు?' | YSRC targets Chandrababu Naidu's secret holiday abroad | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు పర్యటనపై గోప్యత ఎందుకు?'

Sep 3 2016 2:45 PM | Updated on Jul 28 2018 7:54 PM

దేశంలో ఏ ముఖ్యమంత్రి పర్యటనలు అయినా బహిరంగంగానే చెబుతారని, అయితే చంద్రబాబు మాత్రం ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియడం లేదని వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు.

హైదరాబాద్ : దేశంలో ఏ ముఖ్యమంత్రి పర్యటనలు అయినా బహిరంగంగానే చెబుతారని, అయితే చంద్రబాబు మాత్రం ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో తెలియడం లేదని  వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారన్నారు.

తమ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని, ఎలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇక విశాఖలో బాక్సైట్ మైనింగ్ కు చకచకా అనుమతులు ఇస్తున్నారని, బాక్సైట్ మైనింగ్పై వెనక్కి తగ్గకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. కాగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎక్కడ పర్యటిస్తున్నారనే దానిపై గోప్యత పాటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement