మోత్కూరులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి | YSR death anniversary in Motkuru | Sakshi
Sakshi News home page

మోత్కూరులో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి

Sep 2 2016 6:32 PM | Updated on Mar 18 2019 9:02 PM

మోత్కూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 7వ వర్ధంతి నిర్వహించారు.

 మోత్కూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి  7వ వర్ధంతి నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ముఖ్య అతిధిగా హాజరై ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కట్టిన ప్రాజెక్టులకే పేర్లు మారుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా బాలెం మధు కూడా పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement