అచ్చంపేట: స్నానం చేసేందుకు నదిలో దిగిన యువకుడు గల్లంతైన సంఘటన మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
కృష్ణానదిలో యువకుడు గల్లంతు
Jan 2 2017 10:12 PM | Updated on Sep 5 2017 12:12 AM
అచ్చంపేట: స్నానం చేసేందుకు నదిలో దిగిన యువకుడు గల్లంతైన సంఘటన మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. బెల్లంకొండ మండలం బెల్లకొండ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సైదావలి(23) తన ఆటోలో కొంత మంది ప్రయాణికులను ఎక్కించుకుని ప్రాజెక్టు సందర్శనకు బాడుగకు వెళ్లాడు. సందర్శకులు ప్రాజెక్టును చూస్తుండగా తాను స్నానం చేసేందుకు నదిలో దిగి కాలుజారి నది లోతుల్లోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతని ఆచూకీ కోసం నదిలో ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. సైదావలికి తల్లి నైరున్, భార్య, చిన్న పాప ఉన్నట్లు సమాచారం.
Advertisement


