చికిత్స పొందుతున్న యువతి మృతి | young woman's death being treated | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న యువతి మృతి

Sep 14 2016 3:13 AM | Updated on Aug 1 2018 2:15 PM

చికిత్స పొందుతున్న యువతి మృతి - Sakshi

చికిత్స పొందుతున్న యువతి మృతి

కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతిచెందింది. వివరాలు..

గుండ్రాంపల్లి(చిట్యాల) : కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతిచెందింది. వివరాలు..  మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు బండ గిరిజ కుటుంబం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసముంటోంది. ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ఆమె కూతురు నందిని(21) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. నందిని డెంగీతోనే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మంగళవారం గుండ్రాంపల్లి గ్రామంలో నందిని అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు.
 
 కోమటిరెడ్డి పరామర్శ...
 మృతిచెందిన నందిని కుటుంబసభ్యులు ఎంపీటీసీ గిరిజ, అంజయ్యలను గుండ్రాంపల్లిలో సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు పరామర్శించించారు. వారు నందిని మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ మండల, గ్రామ అధ్యక్షుడు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, నమ్ముల విజయ్, గ్రామ సర్పంచ్ రాచకొండ లావణ్య,సింగిల్‌విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, నాయకులు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement