ఆన్‌లైన్‌లో ఎల్లాపి సభ్యత్వ నమోదు | yellapi member ship in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఎల్లాపి సభ్యత్వ నమోదు

Aug 3 2016 6:49 PM | Updated on Sep 4 2017 7:40 AM

జిల్లాలోని ఎల్లాపి కులస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసంకుల వెంకటేశ్వర్‌రావు, సాయిని నర్సింగరావు తెలిపారు. జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నగరంలో నిర్వహించారు.

కరీంనగర్‌ : జిల్లాలోని ఎల్లాపి కులస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసంకుల వెంకటేశ్వర్‌రావు, సాయిని నర్సింగరావు తెలిపారు. జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత్వం కోసం సీనియర్‌ సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా సభ్యత్వ నమోదు ఉంటుందని, దీనికోసం ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నుంచి వచ్చిన నిధులతో చింతకుంటలో ఎల్లాపి భవనం నిర్మించినా ఇప్పటివరకు లెక్కలు చూపించలేదన్నారు. అందులో నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మే 22న యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు, సంఘం పెద్దలతో కలిసి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. ఈ కార్యవర్గం ప్రతి నెలా రెండో ఆదివారం సమావేశమవుతుందని, సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా కోశాధికారి తూం లక్ష్మీకాంతరావు, సల్వాజి భూపతిరావు, తోట శ్రీపతిరావు, మాదాసు మోహన్‌రావు, యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు సాయిని రవీందర్‌రావు, నాయిని ప్రభాకర్‌రావు, జాజాల రాజగోపాల్, పారువెల్లి జీవన్‌రావు, వేల్ముల ప్రకాశ్‌రావు, చంద ప్రకాశ్‌రావు, కైలాస నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement