‘గడువు లోపల పనులు పూర్తి చేయాలి’ | 'works should be completed within the deadline ' | Sakshi
Sakshi News home page

‘గడువు లోపల పనులు పూర్తి చేయాలి’

Sep 21 2016 11:11 PM | Updated on Mar 21 2019 8:35 PM

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ ఆధారంగా జలాల్‌పూర్‌ శివారులో నిర్మిస్తున్న మిషన్‌ భగీరథ ఇంటెక్‌ వెల్‌ పనులను గడువు లోపల పూర్తి చేయాలని కలెక్టర్‌ యోగాతా రాణా అధికారులను ఆదేశించారు.

బాల్కొండ :
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ ఆధారంగా జలాల్‌పూర్‌ శివారులో నిర్మిస్తున్న మిషన్‌ భగీరథ ఇంటెక్‌ వెల్‌ పనులను గడువు లోపల పూర్తి చేయాలని కలెక్టర్‌ యోగాతా రాణా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఇంటెక్‌వెల్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించారు. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కువ సమయం తీసుకుంటే చర్యలు తప్పవన్నారు. పనులను అధికారులు పరిశీలించాలని, నాణ్యతతో సాగేలా చూడాలని ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఫెడస్టల్‌ పైప్‌లైన్, సబ్‌స్టేషన్‌ పనులను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ పండరినాథ్, ఎంపీడీవో శ్రీనివాస్, జలాల్‌పూర్‌ సర్పంచ్‌ జక్కగంగారాం, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్‌ భగీరథ అధికారులు ఉన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement