వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Feb 18 2017 11:30 PM | Updated on Sep 5 2017 4:02 AM

కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన శిల్ప(24) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు.

కుందుర్పి : కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన శిల్ప(24) అనే వివాహిత శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు, గ్రామస్తులు తెలిపారు. వారి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం పొన్నసముద్రానికి చెందిన చిక్కీరప్పతో నాలుగేళ్ల కిందట శిల్ప వివాహమైంది. ఏడాది పాటు వారి సంసారం సజావుగా సాగింది. ఆ తరువాత వేరు కాపురం వెళ్దామని భర్తకు చెప్పగా ఆయన ససేమిరా అనడంతో రెండేళ్ల కిందట ఆమె అగిగి పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు భర్త కోరగా పంచాయితీలు జరిగాయి.

భర్త, వారి బంధువులు శనివారం కరిగానిపల్లికి వచ్చి శిల్ప తండ్రి రామప్పతో కలసి చర్చించారు. ఎలాగైనా కాపురానికి పంపాలని వారు కోరగా, రామప్ప తన కుమార్తెకు సర్దిచెప్పారు. దీంతో ఆమె భర్త వెంట వెళ్లేందుకు సమ్మతించినట్లు గ్రామస్తులు తెలిపారు.  సాయంత్రం 3 గంటలకు తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. మృతురాలికి మూడేళ్ల కుమార్తె ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement