వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 17 2017 10:47 PM | Updated on Sep 19 2017 4:41 PM

చిన్నకోట్లకు చెందిన లక్ష్మీదేవి (28)అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.

ముదిగుబ్బ: చిన్నకోట్లకు చెందిన లక్ష్మీదేవి (28)అనే వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు దంపతులు ధర్మవరం పట్టణంలో నివాసం ఉంటూ మగ్గం పనులు చేసుకునేవారు. కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న లక్ష్మీదేవి ఇటీవల పుట్టినిల్లు అయిన ముదిగుబ్బ మండలం చిన్నకోట్లకు వచ్చింది. ఆదివారం కడుపునొప్పి భరించలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్‌ఐ రహీం కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement