వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Sep 13 2017 10:11 PM | Updated on Sep 19 2017 4:30 PM

బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.

శింగనమల: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు.. రోటరీపురం గ్రామానికి చెందిన రాచమల్ల అనిత (28), సురేష్‌ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్‌ ఎరువుల దుకాణంలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అనిత బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కట్నం కోసం అత్తమామలు వేధించడం వల్లే అనిత ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement