సంతానం కలగలేదని వివాహిత ఆత్మహత్య | woman suicides | Sakshi
Sakshi News home page

సంతానం కలగలేదని వివాహిత ఆత్మహత్య

Dec 28 2016 10:16 PM | Updated on Sep 4 2017 11:49 PM

సంతానం కలగలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాంపురానికి చెందిన మధుతో లక్ష్మిదేవి(24)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.

కంబదూరు : సంతానం కలగలేదని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రాంపురానికి చెందిన మధుతో లక్ష్మిదేవి(24)కి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. సంతానం భాగ్యం కలగలేదని ప్రతిరోజూ బాధపడుతుండేది. ఇక పిల్లలు పుట్టరేమోనని జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ నరసింహుడు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement