రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | Woman killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Sep 20 2016 12:26 AM | Updated on Jun 1 2018 8:39 PM

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో రంగనాథమ్మ (45) అనే మహిళ మృతి చెందిన ఘటన మడల పరిధిలోని దొరిగిల్లు మలుపు వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు..

ముదిగుబ్బ: రోడ్డు ప్రమాదంలో రంగనాథమ్మ (45) అనే మహిళ మృతి చెందిన ఘటన మడల పరిధిలోని దొరిగిల్లు మలుపు వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు..

ముదిగుబ్బ మండలం మారాలకు చెందిన చండ్రాయుడు, రంగనాథమ్మలు తన ఆరేళ్ల మనువడితో కలిసి, పులివెందుల వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో మారాల నుంచి బయలు దేరారు. బైక్‌ మార్గమధ్యంలో ముదిగుబ్బ మండలం దొరిగిల్లు క్రాస్‌ వద్ద ఉన్న మలుపు వద్దకు రాగానే బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపతప్పి సైడ్‌వాల్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు చెల్లా చెదురుగా పడిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన రంగనాథమ్మ, చండ్రాయడులను ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్సచేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగనాథమ్మ మృతి చెందగా ఆమె భర్త చండ్రాయుడు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఆరేళ్ల మనుమడికి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement