ట్రాక్టర్‌ ప్రమాదంలో యువతికి గాయాలు | woman injured in accidant | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ప్రమాదంలో యువతికి గాయాలు

Sep 20 2016 9:24 PM | Updated on Apr 3 2019 7:53 PM

తల్లిని కువైట్‌ వెళ్లడానికి పాలకొల్లు బస్టాండ్‌లో హైదరాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కించి తిరిగి ఇంటికి వెళుతున్న యువతిని ట్రాక్టర్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పోడూరు మండలం గుమ్మలూరుకి చెందిన గొల్ల సరిత (17) ఈ ప్రమాదంలో గాయపడి ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

పాలకొల్లు టౌన్‌: తల్లిని కువైట్‌ వెళ్లడానికి పాలకొల్లు బస్టాండ్‌లో హైదరాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కించి తిరిగి ఇంటికి వెళుతున్న యువతిని ట్రాక్టర్‌ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.  పోడూరు మండలం గుమ్మలూరుకి చెందిన గొల్ల సరిత (17) ఈ ప్రమాదంలో గాయపడి ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సరిత తన అన్యయ్య ప్రేమ్‌చంద్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా బస్టాండ్‌ సమీపంలో ఇసుకలోడుతో వెళుతున్న టాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో సరితకు కుడికాలు, పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పాలకొల్లు ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సరిత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement