మహిళా రైతు ఆత్మహత్య | woman farmer commits suicide in karimnagar district | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Aug 12 2016 12:01 PM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం సూరారంలో చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

మహదేవ్‌పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ మండలం సూరారంలో చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది పత్తి పంటతో రూ.3 లక్షలు నష్టం వచ్చింది. అదే విధంగా మేడిగడ్డ బ్యారేజీ కింద భూమిని కోల్పోనుండటంతో నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వరూప ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement