ఇంకుడు గుంతలో పడి మహిళ మృతి | woman died in accident | Sakshi
Sakshi News home page

ఇంకుడు గుంతలో పడి మహిళ మృతి

Jul 31 2016 12:48 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఇంకుడు గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం డోర్నాల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

ధారూర్(రంగారెడ్డి): ఇంకుడు గుంతలో పడి మహిళ మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం డోర్నాల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవమ్మ(25) ఇంటి ముందు పని చేసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి ఇంకుడు గుంతలో పడింది. ఆమెకు ఈత రాకపోవడంతో.. నీట మునిగి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement