భారీ మెజారిటీతో గెలుస్తాం | Win with a huge majority | Sakshi
Sakshi News home page

భారీ మెజారిటీతో గెలుస్తాం

Nov 3 2015 2:59 AM | Updated on Mar 18 2019 8:51 PM

తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు ప్రజలు అధికారం అప్పగించారని, పదేళ్ల కాంగ్రెస్ దు ర్మార్గ పాలన ఇక చాలంటూ ఆ పార్టీని ప్రతిపక్షంలో

టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్

 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు ప్రజలు అధికారం అప్పగించారని, పదేళ్ల కాంగ్రెస్ దు ర్మార్గ పాలన ఇక చాలంటూ ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు.  కాం గ్రెస్ ఎప్పు డూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే బతుకుతుందన్నారు. ఈసారి వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని, పాజిటివ్ ఓటుతో భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి దయాకర్ గెలుస్తారన్నారు. సోమవారం ఆయ న టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఒక సామాన్య కార్యకర్తను పోటీకి పెట్టి పార్లమెంటుకు పంపాలన్న  కేసీఆర్ నిర్ణయంపై యావత్ తెలంగాణ హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెస్ నేతలు చేవెళ్ల, మెదక్ ప్రాంతాల్లో సొరంగాలు, కాల్వలు తవ్వి రూ.8వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. ఇదే వేరే దేశాల్లో అయితే, అప్పటి ఇరిగేషన్ మంత్రులను ఉరి తీసేవారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement