భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య | wife committed suicide due to harassment | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

Feb 24 2016 7:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

అనంతసాగరం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమతి(25)కి అదే గ్రామానికి చెందిన సుధాకర్(33)తో ఏడేళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ప్రశాంతి(5), నిర్మల(3) ఇద్దరు పిల్లలు.

గత కొన్ని రోజులుగా సుధాకర్ రోజూ తాగొచ్చి సుమతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా సుధాకర్ మద్యం సేవించి వచ్చాడు. వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో మనస్తాపం చెందిన సుమతి పురుగుల మందు మింగింది. వెంటనే సుధాకర్ ఆమెను ఆత్మకూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. సుమతి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement