శివమెత్తిన ‘గంగ’ | Water from the well dried | Sakshi
Sakshi News home page

శివమెత్తిన ‘గంగ’

Mar 14 2017 10:22 PM | Updated on Sep 5 2017 6:04 AM

శివమెత్తిన ‘గంగ’

శివమెత్తిన ‘గంగ’

చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లిలోని పాడుబడ్డ బావిలో నీరు పెల్లుబుకుతోంది. స్థానికులు తెలిపిన మేరకు... రైతు కె.చిన్నప్పయ్య పొలంలో ఏర్పాటు చేసుకున్న బావిలో పదేళ్ల కిందటే నీళ్లు అడుగంటిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం..

చిలమత్తూరు (హిందూపురం): చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీ వై.గొల్లపల్లిలోని పాడుబడ్డ బావిలో నీరు పెల్లుబుకుతోంది. స్థానికులు తెలిపిన మేరకు... రైతు కె.చిన్నప్పయ్య పొలంలో ఏర్పాటు చేసుకున్న బావిలో పదేళ్ల కిందటే నీళ్లు అడుగంటిపోయాయి. మంగళవారం మధ్యాహ్నం యర్రకొండ అటవీ ప్రాంతంలో, చిలమత్తూరు పరిసర ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో మెరుపులు సంభవించినప్పుడు శిల బావిలో పడడంతో నీరు పైకి పెల్లుబికి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎండిన బావిలో జలధార నిండుగా రావడంతో గ్రామస్తులు తిలకించేందుకు క్యూ కట్టారు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement