ఉప్పొంగిన గెడ్డలు | water flows into villages | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన గెడ్డలు

Sep 27 2016 12:23 AM | Updated on Sep 4 2017 3:05 PM

రోడ్డుపై పారుతున్న గెడ్డను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కళావతి

రోడ్డుపై పారుతున్న గెడ్డను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కళావతి

భారీ వర్షానికి సీతంపేట మండలంలోని రెండు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పాలకొండ–సీతంపేట ప్రధాన రహదారి మార్గంలోని కుశిమి, కిట్టాలపాడు గెడ్డలు ఉద్ధృతంగా ప్రహిస్తున్నాయి. ప్రధాన రోడ్డు ముంచెత్తడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

 సీతంపేట: భారీ వర్షానికి సీతంపేట మండలంలోని రెండు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పాలకొండ–సీతంపేట ప్రధాన రహదారి మార్గంలోని కుశిమి, కిట్టాలపాడు గెడ్డలు ఉద్ధృతంగా ప్రహిస్తున్నాయి. ప్రధాన రోడ్డు ముంచెత్తడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండువైపులా భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పాలకొండ నుంచి సీతంపేట మండలం వెళుతున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వెనుదిరిగారు. తాడు సాయంతో గెడ్డ దాటుతుండగా ఆరుగురికి గాయలయ్యాయని, మరో ద్విచక్రవాహనం కొట్టుకుపోయిందని స్థానికులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement