వినాయక నిమజ్జనంలో విషాదం | vinayaka nimajjanam vishaadam | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనంలో విషాదం

Sep 17 2016 12:10 AM | Updated on Sep 4 2017 1:45 PM

వినాయక విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి నీట ముని గి మృతిచెందిన సంఘటన మండలంలోని శాయంపేట హవేలిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకా రం..

 
గీసుకొండ : వినాయక విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి నీట ముని గి మృతిచెందిన సంఘటన  మండలంలోని శాయంపేట హవేలిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకా రం.. శాయంపేట హవేలి గ్రామంలో ఈ నెల 14న(బుధవారం) రాత్రి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి గ్రామ శివారులోని చెరువు వద్దకు గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లారు. నిమజ్జన సమయం లో అదే గ్రామాని కి చెందిన చల్లా వేణుగోపాల్‌(38) చెరువులోకి దిగి నీట మునిగాడు. అయితే అక్కడున్న వారెవరూ గమనించలేదు. ఈ విషయం తెలియని బంధువులు అతడి గురించి పలుచోట్ల వెతికగా ఆచూకీ తెలియలేదు. మృతు డి సోదరుడు శుక్రవారం చెరువు వద్దకు వెళ్లి చూడగా వేణుగోపాల్‌ మృతదేహం నీటిపై తేలు తూ కనిపించింది. మృతుడి తల్లి కాం తమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై నవీ¯Œ కుమార్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement