నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్‌ | vikas program for un employed | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్‌

Nov 2 2016 10:43 PM | Updated on Oct 5 2018 6:29 PM

నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్‌ - Sakshi

నిరుద్యోగ యువత ఉపాధికే వికాస్‌

రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు పొందలేని వారిలో నైపుణ్యతను పెంచి వారికి ఉపాధి కల్పించేందుకు ‘వికాస్‌’ సంస్థ కృషి చేస్తుందని కలెక్టర్‌హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో బుధవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నన్నయవర్సిటీతోపాటు వికాస్, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెం

కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్‌
రాజరాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు పొందలేని వారిలో నైపుణ్యతను పెంచి వారికి ఉపాధి కల్పించేందుకు  ‘వికాస్‌’ సంస్థ కృషి చేస్తుందని  కలెక్టర్‌హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో బుధవారం ఆయన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నన్నయవర్సిటీతోపాటు వికాస్, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఎంప్లాయ్‌మెంట్‌ జనరేష¯ŒS మిషన్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ గౌరవ అతిథిగా పాల్గొన్నారు.  ఏడాదికి 10 వేల చోప్పున మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనేది లక్ష్యమన్నారు. నన్నయ వర్సిటీ పరిధిలోని 450కిపైగా గల అనుబంధ కళాశాలల్లో చదువుతున్న లక్ష మందికి పైగా విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికి ఉపాధి కల్పించడమే తమ థ్యేయమని ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ. నరసింహరావు అన్నారు.
5 వరకు శిక్షణ : ఉభయ గోదావరి జిల్లాల్లోని 12 హెచ్‌ఆర్‌డీ సెంటర్లలో ఈ శిక్షణ  కార్యక్రమం ఈ నెల 5 వరకు ఉంటుందని ఏపీఎస్‌ఎస్‌టీసీ ప్రాజెక్టు డైరెక్టర్‌ వీఎ¯ŒSరావు తెలిపారు. అనంతరం వారు ఉభయ గోదావరి జిల్లాల్లోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు వెళ్లి నిరుద్యోగ యువతకు 45 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. బ్యాచ్‌కి 60 మందికి శిక్షణ ఇస్తారని, 30 రోజుల శిక్షణ అయిన  వెంటనే శిక్షణ పొందిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ ఎస్‌ఎస్‌టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి. రంగయ్య, మేనేజర్‌ విజయ్‌కుమార్, డీఆర్‌డీఏ జేడీఎం ఎం.సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement