రోహిత్ ను గాంధీతో పోల్చడం సిగ్గుచేటు | venkaih naidu speech in pullareddy ingineering collage | Sakshi
Sakshi News home page

రోహిత్ ను గాంధీతో పోల్చడం సిగ్గుచేటు

Apr 3 2016 12:30 AM | Updated on Apr 4 2019 5:53 PM

రోహిత్ ను గాంధీతో పోల్చడం సిగ్గుచేటు - Sakshi

రోహిత్ ను గాంధీతో పోల్చడం సిగ్గుచేటు

రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని, కొంతవుంది అతడిని గాంధీతో పోలుస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వుంత్రి వెంకయ్యునాయుుడు వివుర్శించారు.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విద్యార్థి ఆత్మహత్యను నేతలు రాజకీయం చేస్తున్నారు
దేశవిద్రోహులకు వత్తాసు పలుకుతున్నారు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

 మేడ్చల్ రూరల్ : రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని, కొంతవుంది అతడిని గాంధీతో పోలుస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వుంత్రి వెంకయ్యునాయుుడు వివుర్శించారు. హైదరాబాద్‌లోని వివిధ యూనివర్సిటీల్లో గత ప్రభుత్వాల హయాంలో 11మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎలాంటి రాజకీయం చేయని వారు ఇప్పుడెందుకు రాజకీ యం చేస్తున్నారో? అందరికీ తెలుసన్నారు. మేడ్చల్ వుండలంలోని మైసవ్ముగూడ వుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవానికి శనివారం ఆయు న వుుఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన వూట్లాడుతూ దేశంలోని కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ యుూనివర్సిటీ వి ద్యార్థులు దేశ విద్రోహులైన అఫ్జల్‌గురు, యూకుబ్ మెమె న్, వుక్బూల్‌భట్ వంటి వారికి వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారికి వి ద్యార్థి సంఘాలు, విద్యార్థులే కాకుం డా కొంతవుంది రాజకీయు నాయుకులు సైతం తొత్తులుగా వూరుతున్నారన్నారు. మరోవైపు ‘భారత్ వూతా కీ జై’ అంటే అభ్యంతరం వ్య క్తం చేయుడం చూస్తున్నావున్నారు. యుూని వర్సిటీల్లో విద్యార్థులు ఇలాంటి వా టిని పట్టించుకోకుండా తవు చదువులపై శ్రద్ధ చూపి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు.

ప్రస్తుతం విద్యార్థులకు కావాల్సింది ఉద్యవూలు కావ ని, చదువులు కావాలన్నారు. ప్రస్తు తం కొన్ని యుూనివర్సిటీల్లో కొంతవుంది బీఫ్ ఫెస్టివల్, మరో ఫెస్టివల్ జరపడం సరికాదని, వర్సిటీల్లో జరగాల్సింది ఎడ్యుకేషన్ ఫెస్టివల్ అన్నారు.

 ఈ - లైబ్రరీని ప్రారంభించిన వెంకయ్యనాయుడు
కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన శనివారం ఈ - లైబ్రరీని  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు  అధ్యాపకులను సత్కరించారు. అనంతరం వుల్కాజిగిరి ఎంపీ, వుల్లారెడ్డి కళాశాలల చైర్మన్ వుల్లారెడ్డి కేంద్రవుంత్రి వెంకయ్యునాయుుడిని ఘనంగా సన్మానించారు. కార్యక్రవుంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రవుణ, మేడ్చల్ ఎంపీపీ విజయులక్ష్మి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ వుల్లారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, వుండల టీడీపీ, బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, కళాశాల సెక్రటరీ వుహేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement