గుర్తుతెలియని యువకుడి మృతదేహం స్వాధీనం | unknowen body identified | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని యువకుడి మృతదేహం స్వాధీనం

Aug 7 2016 12:30 AM | Updated on Aug 21 2018 5:54 PM

ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలంలోని జాజాపూర్‌ శివారులో శనివారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం బాటసారులకు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సాయికుమార్‌ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఒంటిపై గులాబీ గీతలతో తెల్లచొక్కా, నీలిరంగు ప్యాంటు ఉన్నాయి. ఈ యువకుడు ఊట్కూర్‌ మండల

నారాయణపేట రూరల్‌ : ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట మండలంలోని జాజాపూర్‌ శివారులో శనివారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి (30) మృతదేహం బాటసారులకు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ సాయికుమార్‌ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడి ఒంటిపై గులాబీ గీతలతో తెల్లచొక్కా, నీలిరంగు ప్యాంటు ఉన్నాయి. ఈ యువకుడు ఊట్కూర్‌ మండలం లక్ష్మీపల్లికి చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. అక్కడి ఆనవాళ్లను బట్టి వారంరోజుల క్రితమే మద్యంలో క్రిమిసంహారక మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త నారాయణపేట ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement