గుర్తు తెలియని వ్యక్తి మృతి | un known person died | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వ్యక్తి మృతి

Aug 8 2016 12:55 AM | Updated on Sep 28 2018 3:41 PM

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని కాలిన రోగుల వార్డు పక్కన ఉన్న విశ్రాంతి భవనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

కర్నూలు (టౌన్‌): కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని కాలిన రోగుల వార్డు పక్కన ఉన్న విశ్రాంతి భవనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతునికి సంబంధించిన వివరాలను మూడో పట్టణ సీఐ మధుసూధన్‌రావు ఆదివారం విలేకరులకు వివరించారు. సుమారు 55 సంవత్సరాల వయస్సు, 5.2 అడుగుల ఎత్తు కలిగి నలుపు రంగులో ఉన్నట్లు తెలిపారు. మాసిన గడ్డం, నలుపు రంగులో తల వెంట్రుకలు, నస్యం రంగు హాఫ్‌ షర్టు, నీలం, గులాబి రంగు కలిగిన పలుచని దుప్పటి, బూడిద రంగు జీన్స్‌ ప్యాంటు వేసుకున్నట్లు తెలిపారు. కుడిపక్క కడుపు వద్ద నల్లటి పుట్టు మచ్చ, మెడ కింద పుట్టు మచ్చ ఉందని తెలిపారు. చాలా రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేక విశ్రాంతి భవనంలో ఉన్నాడని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటల మద్య చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. ఆచూకీ తెలిసిన వారు సిఐ 94406–27735 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement