'ప్రజాస్వామ్య హక్కులను బాబు కాలరాస్తున్నారు' | ummareddy venkateswarlu condemned arrest of Mithun Reddy | Sakshi
Sakshi News home page

'ప్రజాస్వామ్య హక్కులను బాబు కాలరాస్తున్నారు'

Jan 17 2016 11:12 AM | Updated on May 29 2018 4:23 PM

'ప్రజాస్వామ్య హక్కులను బాబు కాలరాస్తున్నారు' - Sakshi

'ప్రజాస్వామ్య హక్కులను బాబు కాలరాస్తున్నారు'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ సీఎం తీరుపై ఎమ్మెల్సీ మండిపడ్డారు. ప్రజాదరణ పొందిన వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి చర్యలు మంచివి కావని ఉమ్మారెడ్డి హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement