breaking news
MLC Ummareddy Venkateswarlu
-
బాబు అంటేనే ప్రకటనలూ, ప్రచారమూ..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాజకీయాల్లోకి వచ్చాక నిప్పులాంటోడినని మాటలు మాత్రమే చెబితే కుదురు తుందా? 20 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం, ఇటీవలే ఉప్పులేటి కల్పనను కూడా లాగేయడం చూస్తే... నేను నీతిమంతంగానే చేశాను. వాళ్లు నన్ను చూసి నా అభివృద్ధిని చూసి వచ్చారు అని అంటే ఎలా? అలా వెళ్లిన వారే ఇప్పుడు మావద్దకు వచ్చి తప్పు చేసి వెళ్లామని... టీడీపీలో పార్టీ కార్య కర్తకు దక్కేపాటి మర్యాద కూడా మాకు లేదని వాపోతున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రకటనలు, ప్రచార యావ తప్ప, రాజకీయ మ్యానిప్యులేషన్ తప్ప మరొకటి లేదని మాజీ కేంద్ర మంత్రి, వైఎస్సార్సీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. కాపులను బీసీల్లో చేర్చడం వీలుపడదని తెలిసీ ఎన్నికల ప్రయోజనం కోసం కాపు లను బీసీల్లో చేరుస్తామని చెప్పడం ఆయనలోని ద్వంద్వ మనస్తత్వానికి తార్కాణం అంటున్నారు. అనాలోచితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రకటించి, తర్వాత వాటిని చేయలేక ఇబ్బం దులకు గురవటం బాబు కెరీర్ మొత్తంలో కనిపిస్తుంటుందని. మాట మార్చడం అనేది ఆయన సహజ లక్షణమంటున్నారు. మోదీ నరహంతకుడనీ, ఏపీలోకి అడుగుపెట్టనివ్వమనీ గతంలో వ్యాఖ్యానించిన బాబు.. అవసరం కోసమే ఇప్పుడు మోదీతో పొత్తు పాటిస్తున్నారు తప్పితే అది శాశ్వత మిత్రత్వం కాదంటున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... 33 ఏళ్లపాటు టీడీపీలో కొనసాగారు. ఉన్నట్లుండి వైఎస్సార్సీపీలోకి ఎలా వచ్చారు? ఎన్టీరామారావు వద్ద సుదీర్ఘకాలం నిజాయితీగా పనిచేశాను. ఇక చంద్రబాబు సీఎం అయినప్పుడు నాటి పరిణామాల నేపథ్యంలో ఆయన వెంటే నడిచాను. 2008 నాటికి చిరంజీవి పార్టీ పెట్టాలని ఆలోచనకు వచ్చాడు. ఒకరోజు ఆయన నన్ను ఇంటికి పిలిచి పార్టీ గురించి అడిగితే ఇవ్వాళ వచ్చి సీఎం కావాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావద్దు. అలావస్తే మీరు నిరాశకు గురవవచ్చు అని నేను నిక్కచ్చిగా చెప్పాను. తర్వాత ఆయన పార్టీ పెట్టారు. కానీ అప్పటికే వ్యతిరేకించాను కాబట్టి నన్ను సంప్రదించలేదు. పిలవలేదు. కానీ చిరంజీవి పార్టీ పెట్టిన తర్వాత టీడీపీ ఆఫీసులో నన్ను అనుమానిం చడం మొదలెట్టారు. అవమానించేదాకా వెళ్లారు. ఆఖరుకు నేను కూర్చున్న కుర్చీ టేబుల్ కూడా నాకు చెప్పకుండా లాగేసి తీసేశారు. బాబును కలి సినా పరిష్కారం దొరకలేదు. చివరకు పొలిట్ బ్యూరోలో పనిచేసిన నాకు పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోపో అన్నారు. ఇంతకుమించిన అవమానం లేదని ఇంట్లో కూర్చుండిపో యాను. భార్య చనిపోవడం, పిల్లలు ప్రయోజకులు కావడం, నేను ఒంటరితనం భరించలేక ఏదో వ్యాపకం కావాలి కాబట్టి పిలవగానే బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరిపోయాను. ఎన్టీఆర్‌తోనూ, బాబుతోనూ సన్నిహితంగా ఉన్నారు. వారిమధ్య తేడా ఏమిటి? ఎన్టీఆర్‌తో రాజకీయ సాన్నిహిత్యం అనేది జీవితంలో మరువలేనిది. ఆయనకు ఎప్పుడు కూడా ఒకే పని.. ప్రజలు, వారికి రాజకీయంగా మనం చెయ్యాల్సింది ఏమిటి అనే తత్వం తప్ప మరొకటి లేదు. నాకు పదవి పోయినా పర్వాలేదు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు నేను ఏవైతే అనుకున్నానో వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలే తప్ప, దీనివల్ల నాకు నష్టం జరుగుతుందనుకోవడం లేదనేవారు. అంటే ఆయనది ఒక కన్విక్షన్. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, తాననుకున్నవి, ఊహించినవి ప్రజలకు అంద జేయాలి, చెయ్యాలి అనే తపన ఎన్టీఆర్కుంటే, దీర్ఘకాలం మనం రాజకీయంలో ఉండాలి, దానికి ప్రాతిపదిక వేసుకోవాలనేది బాబు ఆలోచన. చంద్రబాబుకు, జగన్‌కి ఉన్న తేడా ఏమిటి? బాబు సీఎంగా ఉన్నా లేకున్నా ఏదో చెయ్యాలి అనే తపన కంటే ప్రచార యావ ఎక్కువ. ఉదా. అమరావతి. మంచి రాజ ధాని కట్టుకోవాలి అనే ఆలోచనపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. కానీ అమరావతిని 2022 నాటికి దేశంలోనే నంబర్‌వన్ చేస్తాను, 2050 నాటికి ప్రపంచ నగరాలతోనే పోటీ పడతాను అనే ప్రచారం జగన్ అస్సలు చేయడు. ఆ సమయంలో ఏది చేయాల్సి వస్తుందో అదే చేస్తాను అనే తత్వం జగన్‌ది. అంత ప్రచారం చేసుకున్నా వెంటనే యూటర్న్ తీసుకోవడం, అభిప్రాయాలు వ్యక్తం చేసినా, ఆచరణలోకి వచ్చేసరికి బాబు సరిగా చేయడు. చంద్రబాబు తెలివితేటలను మీరు ఎలా అంచనా వేస్తారు? అసాధారణంగా చేయాలనే తపన, ఆదుర్దా చంద్రబాబులో ఉంది. కానీ అనాలో చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రకటించి, తర్వాత వాటిని చేయలేక ఇబ్బందులకు గురవటం బాబు కెరీర్ మొత్తంలో కనిపిస్తుంటుంది. ఇక మానిప్యులేటర్ అనడం కంటే మాట మార్చడం అనేది బాబు సహజ లక్షణం. వైఎస్ జగన్‌పై కేసుల విషయంలో టీడీపీలో ఎలాంటి చర్చ జరిగింది? ఆ చర్చల్లో నేను లేను. బాబు కొన్ని కొన్ని విషయాలను కొందరితోనే చర్చించే వారు తప్ప అందరి దృష్టికీ తెచ్చేవారు కాదు. రాజా అఫ్ కరప్షన్ అనే పుస్తకం గురించి మాకెవరికీ తెలీదు. పార్టీలోని కొన్ని సెక్షన్లే ఆ పనిలో ఉన్నాయి. మైసూరారెడ్డి తది తరులకు ఈ విషయాలు ఎక్కువగా తెలుసు కాబట్టి వారే ఈ పని చేశారు. న్యాయవ్యవస్థపై కూడా బాబుకు పట్టు, పలుకుబడి ఉన్నాయని అంటుంటారు? హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు చలమేశ్వర్, రమణ ఉంటారు. వీళ్లు దీర్ఘ కాలం న్యాయవ్యవస్థలో ఉంటారు. మన వాళ్లంటూ ఉంటే ఎప్పటికైనా మనకు ఉప యోగం ఉంటుంది అని అప్పట్లో బాబు మాతో అన్నారు. దాంట్లో సందేహమేమీ లేదు. న్యాయవ్యవస్థపై పట్టు సాధించాలి అనే దీర్ఘకాలిక ప్రణాళిక ఎప్పుడూ బాబు మనసులో ఉండేది. ఇవ్వాళ ఇతడిని పెట్టుకుంటే పదేళ్లు పోయిన తర్వాత ఇతను ఉపయోగ పడతాడు అనే విషయంలో బాబు సమయస్ఫూర్తితోనే పావులు కదుపుతారు. ఓటుకు కోట్లు కేసులో తాజాగా వచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం? బాబు ఎన్ని విధాలుగా బుకాయించినా కూడా ఓటుకు కోట్లు కేసులో ఈయన అన్నమాటలు సెబాస్టియన్‌ని ఉద్దేశించా, కాదా అనేది ముఖ్యం. ఆయన పేరెత్తలేదు. ఆయనకు ఓటేయమని చెప్పలేదనేది కాదు. అది తప్ప దాంట్లో ఇంకేముంది. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ అనేదానికి అర్థం ఏమిటి? వాటీజ్ ది అదర్ ఇష్యూ అనేదే అతనికి వివరించారు. అదన్నా చెప్పాలి కదా. అతను ఫోన్ చేయడం, తర్వాత జరిగింది అంతా ఈ సందర్భానికి తగినదే కదా. పేరెత్తకున్నా దే బ్రీఫ్డ్ మీ అని చెప్పడం ఓటుకు కోట్లు నేపథ్యంలోనే కదా. దాంట్లో ప్రజలంతా ఒకే అభిప్రాయంతోనే ఉన్నారు. బాబుకు తెలియకుండా రేవంత్ రెడ్డి వెళ్లలేదు అనే అభిప్రాయం మాత్రం ఉంది. రాజకీయాల్లో నిప్పులాంటి వాడినని చంద్రబాబు అంటుంటారు కదా? 20 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం, ఇటీవలే ఉప్పులేటి కల్పననూ లాగేసుకుని కూడా.. నేను నీతిమంతంగానే చేశాను. వాళ్లు నన్ను చూసి నా అభివృద్ధిని చూసి వచ్చారు అని అంటే ఎలా? అలా వెళ్లినవారే ఇప్పుడు మావద్దకు వచ్చి తప్పు చేశామంటున్నారు. టీడీపీలో కనీస మర్యాదా లేదు. కార్యకర్తకు ఇచ్చేపాటి మర్యాద కూడా ఎమ్మెల్యేగా మాకు దక్కడం లేదని వారంటున్నారు. మోదీని గతంలోనరహంతకుడన్న బాబు.. ఇప్పుడు ఎలా మిత్రుడైపోయారు? గోద్రా ఘటన తర్వాత మోదీ నరహంతకుడని, ఆయన్ని ఏపీలో అడుగుపెట్ట నివ్వమని కూడా చంద్రబాబు అప్పట్లో వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ఇప్పుడు మిత్రుడు అయిపోయి ఉండవచ్చు కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వాలు ఉండవు కదా. రాజకీయ అవసరాల కోసం కేంద్రంతో సన్నిహితంగా ఉండాలి కాబట్టి మోదీతో మిత్రత్వం ఉంది. కేంద్రంతో పొత్తు పెట్టు కున్నప్పటికీ ఇంకా కేంద్రం నుంచి ఆశించిన ఫలితాలు ఏపీకి రావడం లేదు. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కూడా పోయింది. ప్యాకేజీ పేరు చెప్పి కేంద్రం రొటీన్‌గా ఇస్తున్నదే తప్ప అదనంగా ఇచ్చిం దేమీ లేదు. ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? ఈ రెండున్నరేళ్ల పాలన బాబు ప్రచారంతోటీ, ప్రకటనలతోటీ జరిగిపోయింది కానీ వాస్తవంగా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇది వచ్చే ఎన్నికల్లో ఆయనకు వ్యతి రేకంగానే ఉంటుంది కానీ బాబుకు మేలు కలిగించదు. ఈ పరిస్థితిని వైఎస్సార్ కాంగ్రెస్ అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉందా? ఇప్పటికైతే వైఎస్సార్సీపీకే పరిస్థితి అనుకూలంగా ఉంది. పోతే రేపు రాజకీయాల్లో ఎన్ని పార్టీలు వస్తాయో, కొత్త పార్టీ పెడతానని, పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించేశాడు. ఇంకా ఏమేం మార్పులు జరుగుతాయన్నది ఇప్పటికైతే చెప్పలేం. ఈరోజుకి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం గ్రాఫ్ తగ్గుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీ గెలుపు దిశలో పోతూ ఉంది. చంద్రబాబు, వైఎస్సార్ ఇద్దరినీ చూశారు. వీరిద్దరినీ పోల్చి చెబుతారా? ఎన్టీరామారావు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా అవి ఇప్పటివరకూ నిలిచిపోయాయి. సబ్సిడీ బియ్యం పథకం, పక్కా గృహాలు.. ఈ రోజువరకు ఏ ప్రభుత్వం కూడా వాటిని ముట్టుకోలేదు. ఇక రాజశేఖరరెడ్డి.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, 108, 104 ఇవి ఆయన ప్రవేశపెట్టిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా వాటిపై చెయ్యి వేయలేదు. ఇవి ప్రజల్లో అంతర్భాగమైపోయాయి. అలాంటి పథకాలు ఏవీ చంద్రబాబు పాలనలో కనిపించవు. -
గడపగడపకు వైఎస్సార్ దిగ్విజయం
-
గడపగడపకు వైఎస్సార్ దిగ్విజయం
- వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెల్లడి - ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా 9న జిల్లా కేంద్రాల్లో ధర్నా - ప్రకాశం జిల్లా ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఐదు నెలల పాటు నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్కువ లక్ష్యాన్ని చేరుకున్నామని పార్టీ నేతలు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రెండు రోజులుగా జరిగిన సమీక్షలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తీరుతెన్నులపై 13 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో జగన్ సమీక్షిం చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ పార్టీనేతలు అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకొచ్చారని, వాటిపై ఎలా పోరాడాలి అనే విషయంలో నేతలకు తమ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మంగళవారం ఉమ్మారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమీక్షలో గ్రామాల్లో పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు పురోగతిపై చర్చించారన్నారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో నూతన కమిటీల ఏర్పాటుకు పేర్లు సూచించాల్సిందిగా జగన్ చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు. గడపగడపకు కార్యక్రమం 92 శాతం మేరకు జరిగిందని, పార్టీ నాయకులు పట్టుదలతో అన్ని నియోజకవర్గాల్లో కొనసాగించారని, అలాంటి వారిని జగన్ అభినందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన వారిని ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఆరోగ్యశ్రీకి సుస్తీ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసిందని.. చివరికి డయాలసిస్ కూడా చేయలేకపోతున్నారని, కేన్సర్ రోగుల విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతుండటాన్ని తమ నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 9న ధర్నా చేపట్టాలని పార్టీ నిర్ణరుుంచినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారని ఉమ్మారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని టీపీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగా అంత బావుంటే, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేరుుంచి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 61వ వర్ధంతి సందర్భంగా కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలు ఘనంగా నివాళి అర్పించారని ఉమ్మారెడ్డి తెలిపారు. జయలలితకు వైఎస్సార్ సీపీ ఘన నివాళి జయలలిత మృతికి సంతాపంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారని ఉమ్మారెడ్డి తెలిపారు. జయ మృతిపై వైఎస్ జగన్ స్పందిస్తూ దేశం మంచి నాయకురాల్ని కోల్పోరుుందని, ఆమె మరణించడం బాధాకరమన్నారని చెప్పారు. -
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా
-
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా
హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 'గడప గడపకు వైఎస్ఆర్' అంశంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షలో చర్చించిన అంశాలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. బుత్ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాన్ని తర్వలో పూర్తి చేయాలని వైఎస్ జగన్ అదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ 9న ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపట్టనుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పొల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వివరించారు. -
'ప్రజాస్వామ్య హక్కులను బాబు కాలరాస్తున్నారు'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్‌ను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ సీఎం తీరుపై ఎమ్మెల్సీ మండిపడ్డారు. ప్రజాదరణ పొందిన వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి చర్యలు మంచివి కావని ఉమ్మారెడ్డి హితవు పలికారు.