ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 'గడప గడపకు వైఎస్ఆర్' అంశంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షలో చర్చించిన అంశాలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. బుత్ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాన్ని తర్వలో పూర్తి చేయాలని వైఎస్ జగన్ అదేశించినట్లు చెప్పారు.