ఇద్దరు దొంగల అరెస్ట్‌ | two thieves arrest | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగల అరెస్ట్‌

May 13 2017 11:31 PM | Updated on Aug 20 2018 4:30 PM

కళ్యాణదుర్గంలోని పలు కాలనీలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు సీఐ శివప్రసాద్‌ తెలిపారు.

కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గంలోని పలు కాలనీలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్‌ చేసినట్లు సీఐ శివప్రసాద్‌ తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఎస్‌ఐ శంకర్‌రెడ్డితో కలసి ఆయన దొంగలను మీడియా ఎదుట హాజరుపరిచారు. స్థానిక దేవీరమ్మ కాలనీలో దాసరి రాజు, హులికల్లుకు చెందిన పెద్దింటి కిష్టప్ప అనే దొంగలను హులికల్లు క్రాస్‌లో ఉండగా అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, కంప్యూటర్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement