లారీ డ్రైవర్ సజీవదహనం | two lorries coiled, driver burnt | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్ సజీవదహనం

Nov 2 2015 7:50 AM | Updated on Sep 29 2018 5:26 PM

లారీ డ్రైవర్ సజీవదహనం - Sakshi

లారీ డ్రైవర్ సజీవదహనం

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు.

ద్వారకాతిరుమల: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రెండు లారీల మధ్య ఇరుక్కోవడంతో.. మంటల నుంచి తప్పించుకోలేక అందులోనే చిక్కుకొని మృతిచెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నారాయణ పురం పంచాయతి పరిధిలోని బుట్టాయగూడెం వద్ద సోమవారం ఉదయం జరిగింది.

రాజమండ్రి నుంచి చింతపండు లోడుతో వస్తున్న లారీ, ఏలూరు నుంచి కాగితాల లోడుతో వస్తున్న లారీ బుట్టాయగూడెం వద్ద ఢీకొన్నాయి. ఈ ఘటనలో కాగితాల లోడు లారీలో ఉన్న డ్రైవర్ రెండు లారీల మధ్య ఇరుక్కున్నాడు. అదే సమయంలో లారీ బ్యాటరీలలో షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు ఎగిసిపడి కాగితాలకు అంటుకోవడంతో.. మంటలు ఒక్కసారిగి లారీ అంతా వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement