నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాళెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రశేఖరపాళెంకు చెందిన చిట్టిబాబు(40), చిన్న(44) అనే వ్యక్తులు నార్తురాజుపాళెం వైపు ద్విచక్రవాహనంలో వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ది్వచక్రవాహనాన్ని ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయిన లారీని కోవూరు వద్ద పోలీసులు పట్టుకున్నారు.