పిడుగుపాటుకి ఎద్దులు మృతి | Two cows killed by lighting in karimnagar district | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి ఎద్దులు మృతి

Aug 11 2015 11:28 AM | Updated on Sep 3 2017 7:14 AM

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలొదిలాయి.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలొదిలాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మూల్కనూరు గ్రామంలో నేటి ఉదయం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీనితోపాటు పిడుగుపడింది. ఆ ప్రదేశంలోనే ఉన్న కాడెడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత రైతు కనకయ్య కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎద్దుల విలువ రూ. 70 వేలు ఉంటుందని రైతు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement