జమ్మలమడుగులో తనిఖీలు: బాంబులు స్వాధీనం | Two bombs seized in jammalamadugu bypass | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగులో తనిఖీలు: బాంబులు స్వాధీనం

Jan 28 2016 8:32 AM | Updated on Sep 3 2017 4:29 PM

వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం మోరుగుడి గ్రామం వద్ద వాహనంలో తరలిస్తున్న రెండు నాటుబాంబులను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.

కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం మోరుగుడి గ్రామం వద్ద వాహనంలో తరలిస్తున్న రెండు నాటుబాంబులను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా తుఫాను వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ క్రమంలో వ్యక్తులు వాహనాన్ని వదిలి పరారైయ్యారు. 

దీంతో పోలీసులు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  వాహనంలోని రెండు నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నించారు. మోరుగుడి గ్రామానికి చెందిన అవినాష్‌రెడ్డి అనే వ్యక్తి మైదుకూరులోని తన సోదరుడిని చంపేందుకు వెళ్తున్నాడని పోలీసులకు డ్రైవర్ వెల్లడించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement