రెవెన్యూలో 174 మంది బదిలీ | TRANSFFERS IN REVENUE DEPARTMENT | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో 174 మంది బదిలీ

May 23 2017 2:24 AM | Updated on Sep 5 2017 11:44 AM

జిల్లావ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 174 మందిని బదిలీ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌...

ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 174 మందిని బదిలీ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌లోని గోదావరి కాన్ఫెరె¯Œ్స హాల్‌లో బదిలీల ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి వరకూ సాగింది. ఐదేళ్లు సర్వీసు నిండిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేశామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావు చెప్పారు. వారు కోరుకున్న చోటుకు అర్హతను బట్టి బదిలీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 154 మంది వీఆర్‌ఓలు, 12 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 8 మంది జూనియర్‌ అసిస్టెంట్‌లను బదిలీ చేశామని చెప్పారు. బదిలీ పత్రాన్ని సిద్ధం చేసి సంబంధిత ఉద్యోగికి అందించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.హైమావతి పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement