ఎమ్మార్పీఎస్ 24వ ఆవిర్భావ కురుక్షేత్ర జిల్లా సన్నాహక సభ అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం మూడు గంటలకు జరగనుంది. సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా
-
అమలాపురానికి కృష్ణ మాదిగ రాక
అమలాపురం టౌ¯ŒS :
ఎమ్మార్పీఎస్ 24వ ఆవిర్భావ కురుక్షేత్ర జిల్లా సన్నాహక సభ అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం మూడు గంటలకు జరగనుంది. సభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.ఎమ్మారీ్పఎస్ జిల్లా ఇ¯ŒSచార్జి మంద వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై ఏడున పది లక్షల మందితో అమరావతిలో జరగనున్న మాదిగల కురుక్షేత్ర మహాసభను విజయవంతం చేసేందుకు జిల్లా సన్నాహాక సభను అమలాపురంలో శనివారం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలు ఈ సభకు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సభ వేదిక ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వరరావుతో పాటు జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆకుమర్తి చిన్నా, గంపల సత్యప్రసాద్, ఆకుమర్తి భాస్కరరావు, మల్లారపు సత్తిబాబు, మిరియాల అశోక్ తదితరులు పాల్గొన్నారు.