రఘురామ కృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ ఫైర్‌ | Mandakrishna Madiga Fires at Raghurama Krishnaraju | Sakshi
Sakshi News home page

రఘురామ కృష్ణరాజుపై మందకృష్ణ మాదిగ ఫైర్‌

May 2 2026 6:03 PM | Updated on May 2 2026 6:31 PM

Mandakrishna Madiga Fires at Raghurama Krishnaraju

భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుపై ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. దళితులను రఘురామకృష్ణ రాజు అవమానపరుస్తున్నారని,. అగౌరవ పరుస్తున్నారని మండిపడ్డారు. దీని పై  తాను చంద్రబాబు నాయుడుని కలుస్తానని, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తామన్నారు. రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి నష్టంగా నేను భావిస్తున్నానన్నారు. 

‘రఘురామకృష్ణం రాజు  దళితులను, క్రైస్తవులను అవమానిస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు ఒక తెలుగు నేలపైనే కాదు దేశం చుట్టూ తిరుగుతున్నాయి. ఆకివీడులో మాల మాదిగల మీద అక్రమ కేసులు పెట్టారు. దళిత వర్గాలకు సంబంధించిన వాళ్లను ఏరకంగా ఇబ్బంది పెట్టినా వారు ఏ స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదు. 67 మందిని జైలుకు పంపడం దళిత వర్గాలను రెచ్చగొట్టడమే. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్న ఈ అంశాలను ఉమ్మడిగా ఎదుర్కొంటాం’ అని హెచ్చరించారు. 

దళితులపై రఘురామ వ్యాఖ్యలు ఇచ్చిపడేసిన మందకృష్ణ మాదిగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement