నేడు మల్లన్న హుండీల లెక్కింపు | today mallanna hundi counting | Sakshi
Sakshi News home page

నేడు మల్లన్న హుండీల లెక్కింపు

Mar 30 2017 11:36 PM | Updated on Oct 8 2018 9:10 PM

శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల్లోని హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో చేపడుతున్నట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త గురువారం తెలిపారు.

శ్రీశైలం: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామి ఉభయదేవాలయాల్లోని హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో చేపడుతున్నట్లు ఈఓ నారాయణ భరత్‌ గుప్త గురువారం తెలిపారు. అధికారులు, సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, స్థానికులు, భక్తులంతా చొక్క, బనియన్లు తీసీవేసి హాజరుకావాలన్నారు. నగదు, ఉంగరాలు ధరించకుండా హుండీల లెక్కింపులో పాల్గొన్నాలని ఆదేశాలు జారీ చేశారు. హుండీ లెక్కింపు ప్రారంభమైన తరువాత అత్యవసరంగా ఎవరైనా సిబ్బంది బయటకు వెళ్లినా, లోపలికి వచ్చినప్పుడు వారి రాకపోకల వివరాలను తెలియజేసేందుకు రిజిస్టర్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని పూర్తిగా సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తున్నామని ఈఓ తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement