నేడు డీజీపీ కీలక సమావేశం | today dgp meeting in rajamahendravaram | Sakshi
Sakshi News home page

నేడు డీజీపీ కీలక సమావేశం

Jan 18 2017 10:14 PM | Updated on Sep 5 2017 1:32 AM

రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) ఎ¯ŒS.సాంబశివరావు గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు

రాజమహేంద్రవరం క్రైం : 
రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) ఎ¯ŒS.సాంబశివరావు గురువారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు లాహస్పి¯ŒS హోటల్‌ కాన్ఫరె¯Œ్స హాల్లో నిర్వహించే ఈ సమావేశంలో గంజాయి సాగు, అక్రమ రవాణా నిరోధంపై చర్చిస్తారని తెలిపారు. అడిషినల్‌ డీజీలు ఎ.బి.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.ద్వారకా తిరుమల రావు (సీఐడీ), కె.ఆర్‌.ఎం.కిషోర్‌ కుమార్‌ (రైల్వేస్‌), హరీష్‌ కుమార్‌గుప్తా (లా అండ్‌ ఆర్డర్‌), ఐజీపీలు కుమార్‌ విశ్వజిత్‌ (నార్త్‌ కోస్టల్‌ జో¯ŒS), ఎ¯ŒS.సంజయ్‌ (సౌత్‌ కోస్టల్‌ జో¯ŒS), మహేష్‌ చంద్ర లడ్డా (ఇంటిలిజ¯Œ్స), అమిత గర్గ్‌ (సీఐడీ), విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ టి.యోగానంద్, డైరెక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. వీరితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన పోలీస్‌ సూపరింటెండెంట్లు, విజయవాడ రైల్వే ఎస్‌ఎస్‌పీ గుంతకల్లు శ్రీనివాస్, పలువురు జిల్లా స్థాయి అధికారులు ప్రోహిబిష¯ŒS అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు, రెవెన్యూ, ఇంటిలిజె¯Œ్స, నార్కోటెక్‌ బ్యూరో, సెంట్రల్‌ ఎక్సైజ్, అండ్‌ కస్టమ్స్‌ శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులు సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement