లారీ బీభత్సం.. ముగ్గురి మృతి | three died in a road accident in nellore district | Sakshi
Sakshi News home page

లారీ బీభత్సం.. ముగ్గురి మృతి

Oct 21 2016 10:35 AM | Updated on Aug 30 2018 4:10 PM

లారీ అదుపుతప్పి బీభత్సం సృష్టించిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు.

మనుబోలు(నెల్లూరు): వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఆపిన ట్రాలీ ఆటోను, ఆ పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పక్కన నిల్చున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపుడి వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇందుకూరు పేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకయ్య, భాస్కర్ అనే ముగ్గురు వ్యక్తులు తమ గొర్రెలను తీసుకుని చిలుకూరులో జరుగుతున్న సంతకు ఆటోలో వెళ్తున్నారు.

కొమ్మలపుడి వద్దకు రాగానే డీజిల్ అయిపోవడంతో వారు దిగి ఆటోను పక్కకు నెడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఆటోతో పాటు ముగ్గురి పైకి దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఆటో ట్రాలీలో ఉన్న పది గొర్రెలు కూడా మృతిచెందాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement